Sunday, August 13, 2017

సాకులు“నాకు స్నేహితులు నాకు అది అలవాటు చేసారు”
“ఆ అమ్మాయి ప్రేమ వల్లె నా చదువు పాడయింది”
“మా భర్త, పిల్లల వల్ల నా కెరీర్ లేకుండా అయ్యింది”
 “మా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్లే ఈ చెత్త కోర్స్ తీసుకోవాల్సి వచ్చింది”కొందరు వారి జీవిత నిర్ణయాలకు వేరే వాళ్ళను ఎందుకు బాద్యులను చేస్తారో అర్థం కాదు. ఆత్మవిమర్శ లాంటివి వాళ్ళు చేయరేమో! మంచి జరిగితే వాళ్ళే కారణం, చెడు జరిగితే మాత్రం ఏవేవో సాకులు, వేరే వాళ్ళపై నిందలు! ఎవరి జీవితానికి వారె బాధ్యులు. వేరే వాళ్ళు ఆ వ్యక్తులకు సలహా ఇచ్చినా, ఒత్తిడి చేసినా, సమయం వృధా చేసినా, నేర్పించినా, అది ఆ వ్యక్తి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకోవటం వల్లే ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు. వ్యక్తులు ఒకప్పుడు ఎదిరించలేని, ప్రశ్నించలేని, ఒప్పించలేని నిస్సహాయతను వేరే వాళ్ళను సాకుగా చూపుతూ బ్రతికేస్తూ పోవటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఎవరో చెప్పినట్లు, “మీరు మీ జీవితానికి సంబంధించిన వరకు మిమ్మల్నితప్ప వేరే సాకులను చూపెట్టనంతవరకు మీరు ఓడిపోలేదు!”

No comments:

Post a Comment