Tuesday, January 2, 2018

యాప్పి న్యూ ఇయర్కొత్త ఆశల ఊహలలో
తాగి చిందులేస్తూ, రోజు మారగానే
జీవితాలు మారిపోయ్తాయి అనే
మాయలో బ్రతికే జీవులు కొందరు

ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న
పనులను, గడియారం ముళ్ళు దాటగానే
చేస్తానని శపథం చేసుకొని
అందరికి చెప్పేసిన శూరులు కొందరు

క్యాలెండరు మారుతున్నా ఆ క్షణాన
కారణం తెలియని
ఆరాటాన్ని ఆత్మీయులతో పంచుకోవాలని
పంచన చేరిన బాంధవ్యదారులు కొందరు

ప్రపంచ నలుమూల లా జరుగుతున్న
ఆర్బాట వేడుకలను
అల్ప సంతోషం తో ఆ టీవీ లో
చూస్తున్న రిమోట్ వీరులు కొందరు

ఒక్క రోజు మారితే,
కాలెండరు తప్ప ఇంకేమి
మారదని  తేల్చుకుని
నిద్రా మార్గాన్ని ఎంచుకున్న వారు కొందరు
వీరందరికీ వాల్ల తృప్తి కోసం

యాప్పీ న్యూ ఇయర్!!!

No comments:

Post a Comment